హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన..

himachal-pradesh-governor-bandaru-dattatraya-manhandled-in-assembly-5-congress-mlas-suspended

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్త్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై అధికార బీజేపీ మండిపడింది. దీనికి కారణమైన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌కు బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనను హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఖండించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం నుంచే కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలో దత్తాత్రేయ ప్రసంగం చివరి వ్యాక్యాలను చదివి తన ప్రసంగం పూర్తైనట్లుగా భావించాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టివేశారు. గవర్నర్‌ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని సస్పెండ్‌ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్‌ భరద్వాజ్‌ తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఖండించింది.

 


                    Advertise with us !!!