ఆన్‌లైన్‌లోనే నామినేషన్లు వేయొచ్చు!

Candidates can file nominations online ahead of state assembly elections

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోను తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించొచ్చునని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఆయన పశ్చిమబెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుర్చేరి అసెంబ్లీకి ఎన్నికల షేడ్యుల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు వాటిని నింపి, ఆన్‌లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆ పత్రాలను సమర్పించాలి.

 


                    Advertise with us !!!