జగిత్యాల లో వింత ఘటన... కోడిపై కేసు

the-case-against-the-chicken-that-caused-the-mans-death/

పోలీస్‍ స్టేషన్‍లో ఇటువంటి కేసు నమోదుకావడం ఇదే మొదటిసారి కావచ్చేమో. మనుషులపై, సంస్థలపై కేసులు నమోదు కావడం మనం చూస్తునే ఉన్నాం. కానీ అన్నింటికీ భిన్నంగా ఒక కోడిపై కేసు నమోదైంది. ఈ వింత ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వెల్గటూర్‍ మండలం కొండాపూర్‍కు చెందిన తనుగుల సత్తయ్య అనే వ్యక్తి కోడిపందాలు ఆడేవాడు. అందులో భాగంగా గొల్లపల్లి మండలం లొత్తునూరులో కోడిపందాలు ఆడటం కోసం కోడికి కత్తులు కడుతుండా అవి గుచ్చుకున్నాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సత్తయ్యకు తీవ్ర గాయాలుకావడంతో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో గొల్లపల్లి పోలీసులు కోడి పందాల్లో పాల్గొన్న 15 మందితో పాటు.. కోడిపై కూడా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కోడిని రిమాండ్‍ తరలిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

 


                    Advertise with us !!!