వలయంలో నెట్టుకొస్తున్న చంద్రబాబు... అందుకే పార్టీకి ఈ పరిస్థితా...?

Chandrababu is pushing in the circle ... that is why this situation is for the party

తెలుగుదేశం పార్టీలో చాలామంది అగ్రనేతలు చంద్రబాబునాయుడికి భారం గా మారారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తమ మాట వినడం లేదు అనే వ్యాఖ్యలు కూడా కొంత మంది స్థానిక నేతలు చేస్తూ వస్తున్నారు ప్రధానంగా అగ్ర నేతలు పార్టీలో కీలక పాత్ర పోషించడం చంద్రబాబు నాయుడు వారి మాట పదే పదే వినడం జరుగుతూ వస్తున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి నేతలతో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు.

రాయలసీమ జిల్లాల్లో చాలా మంది స్థానిక నేతలు చంద్రబాబు నాయుడు ని కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా చాలామంది నేతలు ఆయనను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు క్షేత్రస్థాయిలో నేతలను కలిసి ప్రయత్నం చేయటంలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఒక వలయం ఏర్పడింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వలయం లో ఉన్నారు.

ఆ వలయం దాటి చంద్రబాబు నాయుడు బయటకు రాకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ పడే ఇబ్బందులు కూడా ఊహకు అందవు. అధికార వైసీపీని ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నారు. కొంత మంది స్థానిక నేతలను మాత్రం దగ్గర చేసుకోలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. తాజాగా కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన క్షేత్రస్థాయి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. నారా లోకేష్ కంటే చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ పట్టున్నది కాబట్టి ఆయన కార్యకర్తలతో నేతలతో మాట్లాడుతూ ఉండాలి. ఎంత సేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమయం వృధా చేస్తే ఉపయోగం ఉండదు అని ఆవేదన చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా బలంగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఇబ్బంది పడుతుంది. స్థానిక నేతలు చాలామంది వాస్తవ పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా సరే సాధ్యం కావడం లేదు.

అలాగే మరికొంతమంది నేతలు వైసీపీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. దీనివలన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని అంటున్నారు. దీనివలన అంతిమంగా కార్యకర్తలు నష్టపోతూ అధికార వైసీపీ బలపడుతుంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీని మీద ఎంత వరకు తెలుగుదేశం ఫోకస్ పెడుతుందో చూడాలి. 

 


                    Advertise with us !!!