జగన్ కు కోపం వచ్చిందా...?

ys jagan angry on party leaders

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలోఅధికార వైసీపీ ఎక్కువగా తప్పులు చేస్తున్నది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్ లో కూడా తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యం ఎక్కువగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా కొంతమందికి స్వేచ్చ ఎక్కువగా ఇచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాల్లో చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టిన దృష్టి... వైసిపి బలోపేతం మీద పెట్టలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా కొంతమంది నేతల మీద సీరియస్ గా వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే... తెలుగుదేశం పార్టీ మీద పెట్టిన దృష్టి సంక్షేమ కార్యక్రమాల మీద వైసీపీ నేతలు పెట్టలేకపోయారు. వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లబ్ధిదారులకు వివరించడం వంటివి చేయలేక పోయారు అని చెప్పాలి.

కొంతమంది ప్రచారం చేసే విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా ఒక అవగాహన అనేది లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో తప్పు చేసిన వారిని కాస్త సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఎవరైతే తన మాట వినలేదో... ఎవరైతే తన మాట లెక్క చేయలేదు వాళ్ళందరి మీద కూడా జగన్ సీరియస్ గా ఉన్నారట.

రాజకీయ కారణాలతో సంక్షేమ కార్యక్రమాలను పట్టించుకోని నేతల మీద జగన్ చర్యలకు దిగుతున్నారు అని మీడియా వర్గాలకు సమాచారం కూడా ఉంది. అయితే ముందు మంత్రుల మీద జగన్ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలామంది సోషల్ మీడియాలో దూకుడుగా కనపడటం లేదు. వాళ్ల మీద కూడా జగన్ చర్యలు తీసుకోవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. మంత్రులు కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ని ఎదుర్కొనే విధంగా విమర్శలు చేయాల్సి ఉన్నా చాలా వరకు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చాయి అనే భావనలో జగన్ ఉన్నా కనీసం ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించలేకపోయారు వైసీపీ నేతలు.