మాతృమూర్తి కోసం 62 రోజులు హాస్పిటల్ లో... తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్

TANA President Talluri Jayasekhar s hospital for treatment

తాళ్ళూరి జయశేఖర్, తానా అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాలలో అందరికీ సుపరిచితమైన పేరు. ఎన్నారై గా అమెరికా లో స్థిరపడిన, మాతృదేశం పై మమకారం తో తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్, TANA, NRI ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మంది నిరుపేదలకు, వికలాంగులకు, అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. సేవలోనే తృప్తి ఉందని, ప్రతి ఒక్కరూ మానవత్వం తో ఉండాలని చెప్పేవారు. అమెరికా, ఇండియాలో 13 పెద్ద, పెద్ద కంపెనీల వ్యాపారాలు, సుమారు 2000 మంది కంపెనీ ఉద్యోగులు, తానా బాధ్యతలు, సేవ కార్యక్రమాలతో ప్రతి నిమిషం ఎంతో బిజీగా ఉంటారు. అయితే రెండున్నర నెలల క్రితం తల్లి గారికి కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది.

తరువాత మళ్ళీ కొద్దీ రోజులకే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని తేలడంతో, ఆయన అమెరికా నుంచి హూటాహుటిన భారతదేశానికి వచ్చారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ AIG లో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు సోదరుడు Dr. రాజా తాళ్లూరి, సోదరి Dr. అనిత గొట్టిపాటి తో కలిసి వచ్చారు. రాజా తాళ్లూరి గారు అమెరికాలోని లూసియానలో పెద్ద సొంత హాస్పిటల్స్ బిజీ గా ఉండే డాక్టర్, సోదరి అనిత పెద్ద నురాలజిస్టు డాక్టర్. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 22 వరకు సుమారు 62 రోజులు హాస్పిటల్ లో తల్లి గారితో పాటు ముగ్గురూ ఉన్నారు.

జయశేఖర్ గారికి, హైదరాబాద్ లో రెండు స్వంత ఇండ్లు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో కూడా హాస్పిటల్ లోనే ఉన్నారు. కరోనా మహమ్మారి సోకితే  కుటుంబ సభ్యులే దగ్గరికి వెళ్లని పరిస్థితి. ఎంతో మంది మన దేశంలో కరోనా సోకిన వారిని హాస్పిటల్ లో కూడా పరామర్శించడానికి వెళ్ళలేని పరిస్థితి. ఈ  సందర్భంలో జయ్ గారు ఏ మాత్రం భయపడకుండా 62 రోజులు హాస్పిటల్ నుంచి ఒక్క క్షణం, ఒక్క అడుగు కూడా బయటికి వేయకుండా, ప్రతి క్షణం మాతృమూర్తి కి పక్కనే కనపడుతూ ధైర్యం చెప్పారు. కన్న బిడ్డల ప్రేమతో ఆ తల్లి కరోనా పై పోరాడి విజయం సాధించారు. కేవలం వైద్యం మాత్రమే కాదు ఆత్మీయుల ప్రేమ అభిమానులే ఎంతటి అనారోగ్యాన్నికూడా బాగు చేస్తాయని నిరూపించారు. జయశేఖర్ గారి తో పాటు వారి తోబుట్టువులు డాక్టర్ల గా కూడా సేవలందించారు. చికిత్స తో పాటు, కన్నపిల్లల ప్రేమ కరోనా ను ఓడించింది. మాతృమూర్తి గారు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే, ఆయన ఖమ్మంలో సేవ కార్యక్రమాలు చేయడానికి వచ్చారు. మాతృమూర్తికి సేవలు ఎలా చేయాలో, మన జీవితంలో అన్నింటికీ కంటే ముఖ్యం మాతృమూర్తి అని, వారికి సేవ చేసుకోవడమే గొప్ప పని అని నిరూపించారు. 

ప్రస్తుత సమాజంలో యువతీయువకులు తల్లిదండ్రులను, వృద్దాప్యంలో పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి దండ్రులే కనిపించే దేవుళ్ళు అని, వాళ్ల ను ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టవద్దని మొన్న ఖమ్మం లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులకు సూచించారు. ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు దూరమైపోతున్న ఈ రోజుల్లో, మాతృమూర్తి కోసం జయశేఖర్ గారు పడిన తపన నేటి యువత కు ఆదర్శం. జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న, జన్మనిచ్చిన తల్లి దండ్రులకు సేవ చేయడమే జీవితాన్ని కి పరమార్ధం అని తన సేవ ద్వారా నిరూపించిన తాళ్లూరి పంచాక్షరయ్య గారి సంతానం నేటి సమాజానికి ఆదర్శం.