తానా ఎన్నికలు - లోకేష్‌ కొణిదెల ఏకగ్రీవ ఎన్నిక

lokesh konidela unanimously elected in tana elections

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి పోటీ పడిన  లోకేష్‌ నాయుడు కొణిదెల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తానా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఆయన నరేన్‌ కొడాలి వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డారు. కాగా ఆయనకు ప్రత్యర్థిగా సుమంత్‌ రామిసెట్టి నామినేషన్‌ వేసినప్పటికీ ఆయన నామినేషన్‌ పత్రాలు రెండుసార్లు పంపడం వల్ల ఆయన నామినేషన్‌ను నిబంధనల ప్రకారం ఎన్నికల కమిటీ తిరస్కరించింది. ఆయన తన రెండో నామినేషన్‌ను పంపవద్దని ఫెడక్స్‌ సంస్థకు చెప్పినప్పటికీ వారు రెండోసారి కూడా డెలివరీ చేయడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో లోకేష్‌ కొణిదెలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.