తానా ఎన్నికలు - హితేష్‌ వడ్లమూడి ఏకగ్రీవ ఎన్నిక

hitesh vadlamudi unanimously elected in tana elections

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి పోటీ పడిన హితేష్‌ వడ్లమూడి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తానా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఆయన నిరంజన్‌ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డారు. కాగా నరేన్‌ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డ హేమకానూరు నామినేషన్‌ను నిబంధనల ప్రకారం సరిగా లేనందున తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. నామినేషన్‌లో తానా సభ్యుల సంతకాలు కూడా ఉండాలన్న నిబంధనను ఆయన పాటించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీంతో ఈ పదవికి హితేష్‌ వడ్లమూడిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.