మార్చి 13, 14న హైదరాబాద్ లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో 2021

T News Golden Property Show at Hitex Exhibitions in Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంపై టీ న్యూస్‌ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్స్‌లో గోల్డెన్‌ ప్రాపర్టీ షో 2021 ఏర్పాటు చేసింది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్‌ గ్రూపు భాగస్వామ్యంతో టీ న్యూస్‌ ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా హైదరాబాద్‌కు ప్రాముఖ్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. కోవిడ్‌ తరువాత ఇప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటున్న తరుణంలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాపర్టీ షోను టీ న్యూస్‌ ఏర్పాటు చేసింది. గత 11 సంవత్సరాల్లో తెలుగు న్యూస్‌ ఛానళ్ళలో నెంబర్‌ 1 ఛానల్‌గా పేరు తెచ్చుకున్న టీ న్యూస్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీస్‌పై షోలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌ నుంచి ప్రీమియమ్‌ విల్లాస్‌ వరకు అందరికీ అందుబాటు ధరలో మీ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది. దానికి ఓపెన్‌ వెంచర్లతోపాటు చిన్న, పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల వివరాలను తెలుసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది. మార్చి 13, 14 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితమేనని నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రాపర్టీ షో లో ఓవర్సీస్‌ మీడియా పార్టనర్‌గా 'తెలుగుటైమ్స్‌' వ్యవహరిస్తోంది. అమెరికాలో గత 17 సంవత్సరాలుగా ప్రచురితమవుతూ, వెబ్‌ మీడియా ద్వారా విదేశాంధ్రులకు సమాచార వేదికగా ఉంటున్న 'తెలుగుటైమ్స్‌' అమెరికాలో జరిగే తానా, ఆటా, నాటా, నాట్స్‌, టాటా వంటి జాతీయ సంఘాలు నిర్వహించే మహాసభల్లో మీడియా పార్టనర్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర ప్రాంతీయ తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా తెలుగుటైమ్స్‌ పాలుపంచుకుంటోంది. మొదటిసారిగా టీ న్యూస్‌ ఏర్పాటు చేసిన ఈ గోల్డెన్‌ ప్రాపర్టీ షో 2021లో తెలుగుటైమ్స్‌ భాగస్వామ్యం అవుతోంది. ఈ షోకి ఓవర్సీస్‌ మీడియా పార్టనర్‌గా తెలుగుటైమ్స్‌ను ఎంపిక చేసినట్లు టీ న్యూస్‌ నిర్వాహకులు తెలిపారు.