ఉస్మానియాను పునరుద్ధరిస్తారా? లేక కొత్తగా నిర్మిస్తారా?

government-should-take-high-level-decision-on-osmania-hospital-high-court

ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని, అలాగే చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిని కూల్చవద్దన రెండు పిల్స్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉస్మానియాపై వ్యాజ్యాలన్ని కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. నాలుగు వారాల్లో ప్రభుత్వం వైఖరి వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. వారసత్వ కట్టడాలు కూల్చవద్దన్న వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆదేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.