ఎంపీ బీబీ పాటిల్ కు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం

Best parliamentarian award for zaheerabad mp BB Patil

జహీరాబాద్‍ ఎంపీ బీబీ పాటిల్‍కు ఫేమ్‍ ఇండియా మ్యాగజైన్‍ ఉత్తమ పార్లమెంటేరియన్‍ పురస్కారం లభించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 25 మంది ఎంపీలు ఫేమ్‍ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్‍ ఎంపీ ఒక్కరే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‍ రెడ్డి.. ఎంపీ బీబీ పాటిల్‍ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‍గా గుర్తించిన ఫేమ్‍ ఇండియా మ్యాగజైన్‍ను మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.