అతడిని భారత్ కు అప్పగించాలి : యూకే

Nirav Modi Can Be Extradited To India, Says UK Court

పంజాబ్‍ నేషనల్‍ బ్యాంక్‍ (పీఎన్‍బీ)కు రూ.14 వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‍ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్‍కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‍ చేసిన ప్రయత్నాలన్నింటికీ అడ్డుపుల్ల వేసింది. మనీలాండరింగ్‍ అభియోగాలు రుజువైన నేపథ్యంలో భారత్‍కు అప్పగించాలని వెస్ట్మినిస్టర్‍ మేజిస్ట్రేట్‍ కోర్టు న్యాయమూర్తి సామ్యూల్‍ గూజీ తీర్పు వెలువరించారు. భారత్‍లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్‍ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భారత్‍కు అప్పగించినంత మాత్రన అన్యాయం జరగదని పేర్కొంది. మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టిపారేసింది.

మానీలాండరింగ్‍ విషయంలో భారత్‍ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని అభిప్రాయపడిన కోర్టు.. అతడిని భారత్‍కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్‍ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నీరవ్‍ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!