వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

YSRCP MLC Candidates 2021

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను వైకాపా సీనియర్‍ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‍, చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు అవకావం కల్పించారు. దుర్గాప్రసాద్‍ కుమారుడు కల్యాణచక్రవర్తి, రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఇన్‍ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్‍, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైకాపా నేత మహ్మద్‍ ఇక్బాల్‍, విజయవాడకు చెందిన కరీమన్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. కాగా మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్‍ చంద్రబోస్‍ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.