నిద్రపోతున్న వారికి ఓ అద్భుతమైన అవకాశం

Wakefit sleeping competition 10 lakh prize money for 9 hours

హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించవచ్చు అనుకుని ఉంటాం. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. మీరు చేయాల్సిందల్లా మేక్‍ ఫిట్‍ వారి బ్యాచ్‍ 2021-22 స్లీప్‍ ఇంటర్న్షిప్‍లో పాల్గొనటమే. నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించాలనుకునేవారి కోసం ఇదో అత్యున్నతమైన ఉపాది అవకావం. ఈ ఇంటర్న్షిప్‍లో పాల్గొనే వారు 100 రోజుల పాటు ప్రతి రోజూ 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా, హాయిగా నిద్రపోవాలి.

మొదట ఈ ఇంటర్న్షిప్‍ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యుత్తమంగా నిద్రపోయే కొందమందిని ఎంపిక చేసి 100 రోజుల ఇంటర్న్షిప్‍కు అర్హుల్ని చేస్తారు. ఎంపికైన ప్రతీ ఒక్కరికి లక్ష రూపాయలు అందుతాయి. గెలిచినవారికి మాత్రమే 10 లక్షల రూపాయలు సొంతం అవుతాయి. మీరు ఈ ఇంటర్న్షిప్‍లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern/ ను సందర్శించండి. ఒకటికి రెండు సార్లు పూర్తి వివరాలు.. టర్మస్ అండ్‍ కండీషన్స్ చదివి కాంపిటీషన్‍కు దరఖాస్తు చేసుకోండి.

 


                    Advertise with us !!!