కరోనాపై...తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

telangana-high-court-orders-government-release-corona-bulletin

తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు చేసిన పరీక్షల వివరాలను నివేదికలో పొందుపరిచింది. కరోనా నిర్ధారణ కోసం 1,03,737 ఆర్టీపీసీఆర్‍, 4,83,266 యాంటీజెన్‍ పరీక్షలు చేశామని తెలిపింది.

గతేడాది జూన్‍ 3 నుంచి డిసెంబర్‍ వరకు.. 3 సార్లు సీరం సర్వేలు చేశామన్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా హైకోర్టు ఉదహరించింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రేపటి నుంచి కరోనా బులిటెన్‍ రోజూ విడుదల చేయాలని తెలిపింది. వ్యాక్సిన్‍ రిజిస్ట్రేషన్‍ విధానంపై విస్త•త ప్రచారం చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.