దుమ్ము దుమారం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు

rahul-gandhis-north-south-remarks-triggers-war-of-words-between-congress-bjp

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమ్ము దుమారం రేపుతున్నాయి. ఉత్తరాది, దక్షణాది అన్న అర్థం వచ్చేలా త్రివేండ్రం వేదికగా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఆయనపై తీవ్రంగా మండిపడింది. రాహుల్ గాంధీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. 

స్మృతి ఇరానీ (కేంద్ర మంత్రి) : వారు కృతజ్ఞత లేనివారని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కువ జ్ఞానం లేనివారని వారి గురించి ప్రపంచమే చెబుతోంది అంటూ రాహుల్‌పై స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. ఇక మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ట్వట్టర్ వేదికగా రాహుల్ పై మండిపడ్డారు. అమేధీ ప్రజలను, ఉత్తరాది ప్రజలను దయచేసి తిట్టకండంటూ విజ్ఞప్తి చేశారు. రాహుల్ కుటుంబానికి అమేధీ ప్రజలు చాలా అవకాశాలిచ్చారని ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. మీరు మంచి వ్యక్తులైతే, దేశ ప్రజలందరూ మంచివారేనని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత సీఎంలూ స్పందించారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్ సీఎం)

‘‘రాహుల్ ఏ ప్రాంతంలో కాలు మోపితే అక్కడ కాంగ్రెస్‌ ఖతమే. ఆయన మొదట ఉత్తర భారతాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా చేశారు. ఇప్పుడు దక్షిణ భారత్ వైపు కాలు మోపుతున్నారు. మాతో పాటు ప్రజలందరికీ దేశం అంతా ఒక్కటే. దేశాన్ని ఉత్తర, దక్షిణాదిగా విభజించాలని కాంగ్రెస్ ప్లాన్. ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతారు.’’ అని సీఎం శివరాజ్ స్పష్టం చేశారు. 

యోగి ఆదిత్యనాథ్ (యూపీ సీఎం)

‘‘ఇన్ని సార్లు లోక్‌సభకు పంపిన యూపీ ప్రజలను రాహుల్ కేరళ వెళ్లి మరీ ఎగతాళి చేశారు. అదీ ఇతర దేశాల ప్రతినిధుల ముందు. కొందరికి మాత్రం దేశ అభివృద్ధి నచ్చదు. జాతీయ పార్టీల నేతల వ్యక్తిత్వాన్ని వింటున్నాం. యూపీ ఆయన్ను ఎంపీ చేసింది. ఆయన మాత్రం కేరళ వెళ్లి యూపీ ప్రజలను ఎగతాళి చేశారు. తాము ఉగ్రవాదలుకు భయపడం. కానీ దేశంలోనే ఉంటున్న కొందరికి భయపడుతున్నాం. ఆయన చేసే విభజన రాజకీయాలను చూసి ఆశ్చర్యపోతున్నాం.’’ అని యోగి ట్వీట్ చేశారు. 

వీరితో పాటు అమేధీ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే అదితీ సింగ్ కూడా రాహుల్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ఆకాశానికెత్తి, పాత నియోజకవర్గాన్ని తక్కువ చేసి మాట్లాడటం చాలా పెద్ద తప్పని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలు విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తారని, కానీ నేడు కాంగ్రెస్ వారే విభజన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌కు అమేధీయే రాజకీయాల్లో ఏబీసీడీలు నేర్పిందని గుర్తు చేశారు. అంతేకాకుండా వారి పూర్వీకులకు ఈ ప్రాంతం విజయాలను అందించిందని, రాహుల్‌ను ఢిల్లీకి పంపింది కూడా అమేధీయే అన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇంతటి చరిత్ర ఉన్న అమేధీని నిందించడం సరికాదని, రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని అదితీ సింగ్ డిమాండ్ చేశారు. 

రాహుల్‌కు చురకలంటించిన కపిల్ సిబాల్

రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. ఓటర్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పూర్తిగా గౌరవించాలని రాహుల్‌కు సూచించారు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలన్న విషయం ఓటర్లకు బాగా తెలుసని ఆయన అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఏ సందర్భాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, ఆయన వివరణ ఇచ్చిన తర్వాత స్పందిస్తానని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ఆయనే స్పష్టంగా చెబుతారని పేర్కొన్నారు. అయితే తాము విభజన రాజకీయాలకు పాల్పడుతున్నామని బీజేపీ నిందించడం హాస్యాస్పదమన్నారు. ‘‘రాహుల్ వ్యాఖ్యలపై నేను మాట్లాడలేను. ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారో ఆయన వివరణ ఇవ్వాలి. ఓటర్లను గౌరవించాల్సిందే. వారి స్వేచ్ఛనూ గౌరవించాలి. మమ్మల్ని బీజేపీ విభజన రాజకీయవాదులమని నిందించడం హాస్యాస్పదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విభజన రాజకీయాలు చేస్తోంది.’’ అని కపిల్ సిబల్ మండిపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ కోయంబత్తూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉత్తరాది నుంచి గత 15 సంవత్సరాలుగా తాను ఎంపీగా ఉన్నానని తెలిపారు. రకరకాల రాజకీయాలను చూశాను. కేరళకు రావడం కొత్త ఊపునిచ్చింది. అయితే సమస్యల విషయంలో ప్రజలు దృష్టిపెట్టడం గమనించా. కేవలం దృష్టిపెట్టడమే కాదు... లోతుగా అధ్యయనం చేస్తున్నారు. నేనెప్పుడూ విద్యార్థులకు చెబుతుంటా. కేరళ, వయనాడ్‌ అంటే చాలా ఇష్టం. కేవలం ఆదరాభిమానాలే కాదు. మీ రాజకీయ ధృక్కోణం నడచ్చింది. మీరు చేసే రాజకీయాల్లో నైపుణ్యం దాగి వుంది. దక్షిణాది వారికి సమస్యలపై అవగాహన తక్కువ.’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే దుమ్ము దుమారం రేపుతున్నాయి.