ఆచార్య అభిమానులకు ఫుల్ మీల్సే..

Chiranjeevi s Acharya to be released on May 13

చిరంజీవి హీరోగా కొరటాల డైరక్షన్ లో ఆచార్య రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం మారేడుమిల్లి ఫారెస్ట్ లో చిరూ, చరణ్ ల కాంబినేషన్ సీన్స్ తీస్తున్నారు. ఈ సీన్స్ కు గూస్ బంప్స్ ఖాయమంటున్నారు. ఆచార్య లో చిరు సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్, పూజ లు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

కథాకథనాలపై కొరటాలకు ఉన్న పట్టు మామూలుది కాదు. ఆడియన్స్ గెస్ చేసింది కాకుండా మరోలా కథను మలుపు తిప్పడం ఆయన ప్రత్యేకత. ఇక సంభాషణల విషయం గురించి చెప్పే పన్లేదు. పెద్ద పెద్ద సీన్లు రాసుకోకుండా చిన్న చిన్న మాటల్తో ఒకే ఒక్క డెప్త్ ఉన్న మాటను వాడి ఆ సీన్ నే హైలైట్ చేస్తాడు. తన మేకింగ్ స్టైల్ ను వదలకుండా, చిరూ క్రేజ్ తగ్గకుండా కొరటాల బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఫైట్లు, డ్యాన్సుల మీద ఫుల్ ఫోకస్ కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మణిశర్మ అదిరిపోయే ట్యూన్లు ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలవనుందట. అంటే హీరో లుక్స్, హీరోయిన్ల గ్లామర్, చరణ్ లుక్, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు.. ఇలా అన్నీ కలిపి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా ఆచార్యను వండారట కొరటాల. ఎన్నో అంచనాల మధ్య మే 13న ఆచార్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  

 


                    Advertise with us !!!