కరోనా విజృంభణపై.. అధ్యక్షుడు కీలక నిర్ణయం

Joe Biden aims to distribute masks to millions in equity push

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‍ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‍ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందుకు ఎంత ఖర్చు కానుంది, ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై శ్వేతసౌధం ఎలాంటి సృష్టత ఇవ్వలేదు. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ హయాంలోనే మాస్కులు పంపిణీ చేయాలని భావించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా జో బైడెన్‍ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ప్రజా రవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని బైడెన్‍ తప్పనిసరి చేశారు.