కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతం...

motors-at-the-gayatri-pumphouse-have-so-far-lifted-100-tmc-of-water

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఎత్తిపోతల పథకంలో భాగమైన గాయత్రి పంప్‍హౌస్‍ రికార్డు స్థాయిలో నీటిని ఎత్తిపోసిన ఘనతను సొంతం చేసుకున్నది. 2019 ఆగస్టు 8న ప్రారంభమైన ఈ పంప్‍హౌస్‍లోని మోటర్లు ఇప్పటివరకు 100 టీఎంసీల నీటిని ఎత్తిపోశాయి. గాయత్రి పంప్‍హౌస్‍ ద్వారా ప్రాణహిత నీటిని 111.4 మీటర్లకు ఎత్తిపోసి ఎల్లంపల్లికి తరలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్‍-2లో భాగంగా గాయత్రి పంప్‍హౌస్‍ను నిర్మించారు. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు మోటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో రెండో మోటర్‍ అత్యధికంగా 1,703 గంటలపాటు నడిచింది. ఒకటో మోటరు 1367 గంటల నీటిని ఎత్తిపోసింది. సీఎం కేసీఆర్‍ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని ప్రభుత్వం మూడున్నరేండ్లలోనే పూర్తిచేసిన విషయం తెలిసిందే.