
కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజుల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,738 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది. కొత్తగా 11,799 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,07,38,501 మంది కోలుకున్నారని మంత్రిత్వ శాఖ చెప్పింది. మరో 138 మంది మృత్యువాత పడగా..మొత్తం మృతుల సంఖ్య 1,56,705కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,51,708 యాక్టివ్ కేసులున్నాయని వివరించింది.