త్వరలో యూఎస్ లో గ్రాన్యూల్స్ మైగ్రేన్ ఔషధం విడుదల

Granules India s Migraine Drug gets USFDA nod

అసిటామినోఫెన్‍, ఆస్ప్రిన్‍, కెఫిన్‍ మిశ్రమ ట్యాబ్లెట్‍ను అమెరికాలో విక్రయించటానికి గ్రాన్యూల్స్ ఇండియా అనుమతి సంపాదించింది. దీనిపై దాఖలు చేసిన ఏఎన్‍డీఏ (అబ్రీవియేటెడ్‍ న్యూ డ్రగ్‍ అప్లికేషన్‍) దరఖాస్తును అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‍ఎఫ్‍డీఏ) ఆమోదించినట్లు గ్రాన్యుల్స్ ఇండియా వెల్లడించింది. జీఎస్‍కే కన్సూమర్‍ హెల్త్‌కేర్ కు చెందిన ఎక్సెడ్రిన్‍ మైగ్రేన్‍ ట్యాబ్లెట్‍కు ఇది జనరిక్‍ ఔషధం. 250ఎంజీ/250ఎంజీ/65ఎంజీ డోసులో ఈ జనరిక్‍ ట్యాబ్లెట్‍తో త్వరలో యూఎస్‍లో విడుదల చేయనున్నట్లు గ్రాన్యూల్స్ పేర్కొంది.