గ్రీన్‍కార్డు దరఖాస్తుదారులపై.. బైడెన్ మరో కీలక నిర్ణయం

joe-biden-revokes-trump-era-ban-on-green-card-applicants-that-blocked-legal-immigration-to-us

డొనాల్డ్ ట్రంప్‍ తీసుకున్న నిర్ణయాలను రివర్స్ చేసే పనిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍.. తాజాగా అలాంటిదే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‍కార్డు దరఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా గత ట్రంప్‍ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని బైడెన్‍ ఎత్తేశారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‍ అప్పట్లో చెప్పారు. అయితే ట్రంప్‍ చెప్పిన కారణం సరైనదని కాదు అని తాజా ప్రకటనలో బైడెన్‍ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్‍ చెప్పారు. ట్రంప్‍ తీసుకొచ్చిన ఎన్నో ఇమిగ్రేషన్‍ విధానాలను తాను రివర్స్ చేస్తానని ఎన్నికల సందర్భంగా బైడెన్‍ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు.