దసరా బరిలో బాలయ్య

Gopichand Malineni to team up with Balakrishna for a film

నటసింహం నందమూరి బాలకృష్ణ కు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సినిమాల్లో మాస్ టచ్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు బాలయ్య. ఇక ఫ్యాక్షన్ సినిమాలైతే నెక్స్ట్ లెవల్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎంతమంది సినిమాలు చేసినా సరే బాలయ్య మెప్పించినట్లు ఎవరూ మెప్పించలేకపోయారు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.  

ఇప్పుడు బాలకృష్ణ మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. క్రాక్  సినిమాతో  బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీ చంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. క్రాక్ చూసి పిలిచి మరీ గోపీచంద్ కు బాలయ్య అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కూడిన కథను గోపీచంద్ మలినేని బాలయ్య కోసం వండుతున్నట్లు, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య దానిని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపీచంద్ మలినేని సినిమాను దసరా బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఎలాగూ బాలయ్యకు దసరా సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి అన్నీ కలిసొస్తే తొడగొట్టి మీసం మెలితిప్పి కలెక్షన్స్ కురిపిస్తాడు బాలయ్య.