ఈ ముగ్గురు కేంద్ర మంత్రులపై మోడీకి కోపం ఉందా...?

PM Modi to Reshuffle his Cabinet

కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయంపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఖాళీల నేపథ్యంలో ఆయన ఎవరినీ కేంద్ర మంత్రులు గా తీసుకుంటారు ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే బీజేపీ పెద్దలు ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా పరిశీలించినట్టుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ప్రధానంగా కొన్ని శాఖల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీలో అసహనం ఎక్కువగా ఉంది.

ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పనితీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత కొంతకాలంగా సీరియస్ గానే ఉన్నారనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్  సమయంలో ఆమె కేంద్ర ఆర్ధిక మంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే చర్యలు దిశగా అడుగులు వేయలేకపోయారు. కనీసం తన టీం తో కూడా ఆమె చర్చలు జరిపిన పరిస్థితి లేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆత్మ నిర్భర్ భారత్ విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొంతమంది మీద ఆధారపడాల్సి వచ్చింది.

కాని నిర్మలా సీతారామన్ నుంచి మాత్రం సహకారం రాలేదని కేవలం మీడియా సమావేశానికి మాత్రమే పరిమితం అయ్యారు అని ఆరోపణలు వినిపించాయి. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. వ్యవసాయ చట్టాలు విషయంలో దేశవ్యాప్తంగా సమర్థవంతంగా వ్యవసాయ శాఖ ప్రచారం చేసుకోవాల్సి ఉన్నా సరే రైతులకు అవగాహన కల్పించే విషయంలో ఘోరంగా విఫలమైంది. దీనితో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ శాఖ మంత్రిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ఇప్పుడు వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇక తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగితే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించే అధికారం ఉంటుంది. కానీ ఆయన విచారణకు ఆదేశించలేకపోయారు. కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కిషన్ రెడ్డి పరిమితమయ్యారు. ఇక మరికొన్ని శాఖల మంత్రులను కూడా తప్పించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అలాగే మరి కొన్ని శాఖల మీద కూడా ప్రధానమంత్రి కొన్ని నివేదికలు తెప్పించుకుని పరిశీలించగా మంత్రుల పనితీరులో ఘోరంగా విఫలమయ్యారని అందుకే వారిని కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.