నితిన్ స్పీడు మామూలుగా లేదుగా..

nithin upcoming movies

భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలు పూర్తి చేసిన నితిన్.. నెల రోజుల గ్యాప్ తో ఈ రెండు సినిమాలను థియేటర్లలోకి దింపనున్నాడు. అంధదూన్ తెలుగు రీమేక్ జూన్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత పవర్ పేట అనే సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయనున్నాడు నితిన్.

పవర్ పేటలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడని, అందులో ఒకటి వృద్ధుడి పాత్ర అని అప్పట్లోనే వార్తలొచ్చాయి.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అంధదూన్ షూటింగ్ పూర్తవగానే పవర్ పేట షూటింగ్ లో పాల్గొననున్నాడు నితిన్. ఇవన్నీ చూస్తుంటే నితిన్ స్పీడు మామూలుగా లేదుగా అని అనుకోక మానరు. పోతే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. కృష్ణ చైతన్య నితిన్ తో గతంలో ఛల్ మోహన్ రంగా సినిమా చేసిన విషయం తెలిసిందే.

 


                    Advertise with us !!!