సర్కారు వారి పాటలో మాస్ సాంగ్

Sarkaru Vaari Paata Mass Song under Shekar Master

సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన మహేష్.. ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. టైటిల్ దగ్గర నుంచి మోషన్ పోస్టర్ వరకు అన్నీ ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాల్ని పెంచుతున్నాయి. పరశురామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీ.. మహేష్ అభిమానులకు పక్కా ట్రీట్ ఇవ్వనుందని నమ్మకంగా చెప్తున్నారు.

ఇదిలా ఉంటే దూకుడు, ఆగడు సినిమాల తర్వాత థమన్ మూడోసారి మహేష్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లలో ఉన్న వీరిద్దరి నుంచి ఈసారి ఎలాంటి ఆల్బమ్ రానుందో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని ఆల్రెడీ సాంగ్ కంపోజింగ్ కూడా అయిపోయిందని టాక్. ఆ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు సమాచారం. సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన శేఖర్ మరి ఈసారి యూత్ ని ఏ రకంగా ఉర్రూతలూగిస్తాడో చూడాలి. 

 


                    Advertise with us !!!