
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగానని సురభి వాణీదేవి తెలిపారు. తన నరనరాన ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని అన్నారు. విద్యాసంస్థలను స్థాపించి 35 ఏండ్లుగా విద్యరంగానికి ఎనలేని సేవ చేస్తున్నా..లక్ష మందికిపైగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దా. కిందిస్థాయి నుంచి అంతరిక్షం వరకు నా విద్యార్థులు ఉన్నారు. పట్టభద్రుల సమస్యలు దగ్గర నుంచి చూశా. ఆదరిస్తే ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తా. మా నాన్నకు రిటైర్మెంట్ వయసులో ప్రధాని పదవి దక్కింది. ఇప్పుడు నాకు అలాగే అవకాశం దక్కింది అని వాణీదేవి పేర్కొన్నారు.