ఐదేళ్ల వయసులో ప్రపంచ రికార్డు

5-years-child-creates-world-record-fire-limbo-skating

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఐదేళ్ల చిన్నారి జొన్నాదుల లిషిత ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తణుకులోని స్కేటింగ్‌ కోర్టులో వజ్రా వరల్డ్‌ రికార్డ్‌ ఆధ్వర్యంలో 8 ఆంగుళాల ఎత్తులో ఏర్పాటు చేసిన హార్డిల్స్‌పై మంటలు వస్తుండగా.. వాటి కిందగా స్కేటింగ్‌ చేసి ప్రపంచ రికార్డు సాధించింది. వజ్రా వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ సీఈవో తిరుమలరావు అవార్డుతో పాటు ట్రోఫీ, మెడల్స్‌ను చిన్నారికి అందజేశారు. లిషితను రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌, విద్యావేత్త గుబ్బల తమ్మయ్య అభినందించారు.