సోషల్ మీడియా విలువ కేసీఆర్ కు తెలిసిందా..?

Does KCR know the value of social media

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో భారతీయ జనతా పార్టీ వేసే అడుగులపై ఇప్పుడు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల్లో చాలామంది సీఎం కేసీఆర్ ని తిడుతున్నా సరే సరిగ్గా స్పందించే ప్రయత్నం కూడా చేయకపోవడంపై కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ విషయంలో కాస్త సీరియస్ గానే వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించిన సీఎం ఇక ముందు మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు అనే సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియా ఖాతాలను పెద్దగా మెయింటైన్ చేయటం లేదు. దీని వలన అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అని తెలుస్తుంది.

సోషల్ మీడియా చాలా మంది ఎమ్మెల్యేలకు  ఆయన వ్యక్తిగతంగా క్లాసులు తీసుకునే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు చెందిన చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాలో అసలు ఏమాత్రం కూడా పట్టులేదు. కనీసం తమ కార్యకర్తల ద్వారా కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా సరే సోషల్ మీడియాలో ఖండించే ప్రయత్నం కూడా చాలామంది నేతలు చేయటం లేదు.

ఒక పక్కన దేశవ్యాప్తంగా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇలా వ్యవహరించడం తో సీఎం కేసీఆర్ ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేసే ప్రచారం అంతా కూడా సోషల్ మీడియా ఆధారంగానే ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాను సీరియస్ గా తీసుకోలేదు అంటే మాత్రం వచ్చే ఇబ్బందులు ఊహకు కూడా అందవు. అందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా సరే నేతలు లెక్క చేయకపోతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా సరే మరో నేతకు బాధ్యతలు అప్పగించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లేకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేసిన పర్వాలేదు అనే విధంగా కూడా సీఎం కేసీఆర్ కొంతమంది వద్ద వ్యాఖ్యలు చేస్తున్నారట. ఇటీవల జరిగిన పార్టీ కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది

 


                    Advertise with us !!!