నష్టాన్ని పూడ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్న జగన్... త్వరలో...!

Greater Municipal Corporation Elections at Vizag

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటనే దానిపై విపక్షాలు అన్నీ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే అనుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా అధికార వైసీపీకి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచితూచి స్పందిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని సమస్యలు అలాగే వైసిపి ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఆ పార్టీని మరింత కష్టాల్లోకి అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసలు ఏంటి అనేది ఒకసారి చూస్తే... త్వరలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు అనేది చాలా కీలకం. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే కూడా మూడు రాజధానులు విషయంలో విశాఖ ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది అనేది ఎన్నికల్లో స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది.

కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే లేదు అంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి అన్ని అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ ప్రభావం ఎంత గొప్పగా చెప్పుకున్నా అనుకున్న విధంగా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గనుక వైసిపి ఓడిపోయింది అంటే మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కొనే సమస్యలే కాదు పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది.

అలాగే వైసిపి నేతలు కూడా వ్యక్తిగతంగా విశాఖ జిల్లాలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు విశాఖ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. విశాఖకు కొంతమంది మంత్రులను కూడా ఇప్పటికే పంపించినట్టు గా కూడా తెలుస్తోంది. అక్కడున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా ఇప్పుడు విశాఖ జిల్లాలో మరింత దూకుడుగా ముందుకు అడుగులు వేయనుంది వైసిపి. ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం కోసం ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ కు సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని దీనికి అఖిలపక్ష నేతలు అందరిని కూడా ఆహ్వానించడానికి ఆయన రెడీ అయ్యారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సహా భారతీయ జనతా పార్టీతో పాటు పలు పార్టీల నేతలకు ఆహ్వానం పంపుతున్నారు ముఖ్యమంత్రి మరి ఈ రాజకీయం వైసీపీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.