హైదరాబాద్ లో కూడా కరోనా కేసులు పెరిగాయా?

Covid 19 sequelae cases on the rise in Hyderabad

మహారాష్ట్రలో, కేరళలో, ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగినట్లే హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు పెరిగినట్లు  ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారం క్రితం ఒకటి రెండుగా నమోదయ్యే కరోనా కేసులు.. గడిచిన వారంలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు నమోదవుతున్నాయి. చాలాచోట్ల గత వారం నుంచి కేసులు పెరిగినట్లు చెబుతున్నారు. ప్రకృతి చికిత్సాలయాల్లో,  ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా కేసులు గడిచిన వారంలో పెరుగుతున్నట్లుగా గుర్తించారు. పాత కరోనా వైరస్‌ ఒకరి నుంచి పది మందికి వస్తే.. కొత్త స్ట్రెయిన్‌ మాత్రం ఒకరి నుంచి వందమందికి విస్తరించే లక్షణం ఉందంటున్నారు. గడిచిన మూడువారాల సరాసరులు తీసుకుంటే.. గడిచిన వారంలో మాత్రం పాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిందన్న విషయాన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం అంగీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికైనా మాస్క్‌ వేసుకోకుండా కరోనా నన్ను ఏమి చేయదులే అని అనుకుంటే ఇబ్బందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.