4 లక్షలు కాదు.. 40 లక్షల ట్రాక్టర్ లతో

rakesh-tikait-threatens-centre-says-repeal-farm-laws-or-will-march-to-parliament-with-40-lakh-tractors

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ప్రదర్శనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు రాకేశ్‌ తికాయిత్‌ ప్రకటించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్‌ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈసారి 4 లక్షల ట్రాక్టర్లు కాదు..40 లక్షల ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామన్నారు. రాజస్థాన్‌లో జరిగిన రైతుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారయన.