
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పొలిటికల్ థ్రిల్లర్ నవల రాస్తున్నారు. స్టేట్ ఆఫ్ టెర్రర్ అని నవలకు పేరు పెట్టారు. కెనడాకు చెందిన లూయిజ్ పెన్సీతో కలిసి ఆమె ఈ థ్రిల్లర్ పుస్తకాన్ని రచిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న ఆ నవల మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు సైమన్ అండ్ సూస్టర్ పబ్లిషర్స్ పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో హిల్లరీ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఉత్కంఠ అంశాలను తన పుస్తకంలో హిల్లరీ రాసినట్లు తెలుస్తోంది. లూయిస్‌తో కలిసి థ్రిల్లర్ నవల రాయడం కల నిజమైనట్లుగా ఉందని హిల్లరీ క్లింటన్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యున్నత స్థాయిలో జరిగే దౌత్య మోసాలకు సంబంధించిన అంశాలు ఆ పుస్తకంలో రాయనున్నారు.
గత జూన్‌లో హిల్లరీ భర్త బిల్ క్లింటన్ కూడా ఓ రాజకీయ నవల రాశారు. ద ప్రెసిడెంట్స్ డాటర్ పేరుతో ఆ నవలను రిలీజ్ చేశారు. థ్రిల్లర్ రైటర్ జేమ్స్ పాటర్సన్ రాశారు. వైట్‌హౌజ్‌పై ఉగ్రవాదులు జరిపిన సైబర్‌దాడుల గురించి కూడా 2018లో ద ప్రెసిడెంట్ ఈజ్ మిస్సింగ్ అన్న పుస్తకాన్ని రాసి రిలీజ్ చేశారు.