తెలుగు రాష్ట్రాల్లో అదానీ డేటా కేంద్రాలు

Adani Enterprises EdgeConneX form new data center JV AdaniConneX

తెలంగాణలోని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్‌ (ఈసీఎక్స్‌)తో సమాన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అదానీ ఎంటర్‌ప్రైజ్‌ స్టాక్‌ఎక్స్చేంజీలకు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా అదానీ యాజమాన్యంలో ఉన్న డీసీ డెవలప్‌మెంట్‌ చెన్నై (డీసీడీసీపీఎల్‌)లో 50 శాతం వాటాలను ఈసీఎక్స్‌ యూరప్‌ విభాగానికి విక్రయించనుంది. ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా రానున్న పదేళ్లలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో డేటా కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని వివరించింది.        

 చెన్నైతో ప్రారంభించి నవీ ముంబయి, నోయిడా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు ఈ ఒప్పందాన్ని విస్తరించనున్నాయి. డేటా కేంద్రాల నిర్మాణం, అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్లు సంస్థలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా అదానీకనెక్స్‌ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

 


                    Advertise with us !!!