
తిరుమల శ్రీవారికి తమిళనాడు రాష్ట్రం తేనెకు చెందిన భక్తుడు తంగదొరై రూ.2 కోట్ల విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశారు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్రాలు చేయించినట్లు తంగదొరై తెలిపారు. గతంలోనూ ఆయన శ్రీవారికి బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు విరాళంగా అందజేశారు.