యంగ్ యముడి ప్లానింగ్ అదరహో..

Jr NTR Upcoming Movies with Tivikram Prasanth Neel and Koratala siva

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాతో నేషనల్ లెవల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. తన తర్వాతి సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో హారికా హాసినీ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా కు కమిట్ అయిన తారక్.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవగానే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. దీని తర్వాత తారక్ కు జనతా గ్యారేజ్ లాంటి విజయాన్నందించిన కొరటాల శివతో మరో సినిమా చేయనున్నాడట. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడని, అయితే దానికి డైరక్టర్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు కానీ సినిమా మాత్రం హోమ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే కొత్త నిర్మాతలకు తారక్ డేట్స్ దొరకాలంటే 2024వరకు కష్టమనే చెప్పాలి.

 


                    Advertise with us !!!