సేతుపతికి వరుస ఆఫర్లు.. తిరస్కరిస్తున్న మక్కల్ సెల్వన్

Vijay Sethupathi Rejects back to back Offer

విజయ్ సేతుపతి.. తమిళ ప్రేక్షకులకే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని పేరు. తమిళంలో మాస్టర్, తెలుగులో ఉప్పెన తో చాలా తక్కువ టైమ్ లోనే రెండు పెద్ద విజయాలను అందుకోవడంతో పాటూ, ఆ రెండు సినిమాల సక్సెస్ లలో కీ రోల్ పోషించాడు విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలను కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు సేతుపతి. ఈ తరుణంలోనే ఆయనకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ సేతుపతి మాత్రం వాటన్నింటికీ నో చెప్తున్నాడట.

దీనికి కారణం విజయ్ కు రాబోయే  రెండేళ్లు ఖాళీ లేకపోవడమేనట. గత యేడాదే తర్వాత రెండేళ్లకు డేట్స్ ఇచ్చేశాడట. దీంతో ఇప్పుడు కొత్త సినిమాలకు కమిట్ అయ్యే ఛాన్సే లేదు. చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఆయన కొత్త సినిమాలకు కమిట్ అవాలంటే మరో సంవత్సరం పాటూ వెయిట్ చేయాల్సిందేనంటూ తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. డబుల్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నా.. సేతుపతి కాల్షీట్స్ వీలు కాకపోవడంతో అన్ని ఆఫర్స్ కు నో చెప్తున్నట్లు తెలుస్తుంది.

 


                    Advertise with us !!!