ఎలన్ మస్క్ కు షాక్... ప్రపంచ కుబేరుడి హోదా దూరం

Elon Musk Loses World s Richest Tag as One Tweet Costs Him $15 Billion

అమెరికా విద్యుత్‌ ఆధారిత వాహన తయారీ దిగ్గజం టెస్లా అధిపతి ఎలన్‌ మస్క్‌ను ప్రపంచ కుబేరుడి స్థానం నుంచి దింపేసింది. క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్‌, ఎథర్‌ విలువ ఎక్కువగా ఉందంటూ మస్క్‌ చేసిన ట్వీట్‌.. ఆయన సంపదను ఒక్కరోజే ఏకంగా 15.2 బిలియన్‌ డాలర్లు (రూ.1,10,108 కోట్లు) దిగజార్చింది. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు 8.6 శాతం మేర నష్టపోయాయి మరి. దీంతో బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రపంచ టాప్‌-500 జాబితాలో మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు.

186.3 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో ఉండగా, మస్క్‌ సంపద 183.4 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. నిజానికి బెజోస్‌ సంపద కూడా 3.7 బిలియన్‌ డాలర్లు పతనమైంది. అయినప్పటికీ టాప్‌లో నిలిచారు. బిట్‌కాయిన్‌పై పెట్టుబడులతో మస్క్‌ సంపద ఇటీవలి కాలంలో భారీగా పెరుగగా, ఇప్పుడు అదే కాయిన్‌ కొంపముంచింది. మరోవైపు బిట్‌కాయిన్‌ విలువ కూడా పతనమైంది.

 


                    Advertise with us !!!