ఆ రోజు సూపర్ స్టార్ రజనీ కీలక ప్రకటన...

Rajinikanth February 26th announcement special

ఈ నెల 26వ తేదీన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన ఆరోగ్య రీత్యా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన సృష్టం చేశారు. అయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం శాంతపడటం లేదు. తలైవర్‌ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ధర్నాలు, ఆందోళనలు చేస్తూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన తన సతీమణి లతతో కలిసి 40వ వివాహ వార్షిక వేడుకలను జరుపుకోనున్నారు. ఆ రోజు రజనీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.