జరిగే నష్టాన్ని ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు...?

Centre gives nod to Privatisation of Vizag Steel Plant

విశాఖ ఉక్కు పరిశ్రమ గనుక విక్రయిస్తే ఉండే సమస్యలు, వచ్చే సమస్యల గురించి వైసీపీకి గాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి గాని అవగాహన లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దక్షినాది రాష్ట్రాల విషయంలో ఇప్పటికే కేంద్రం చాలా అలసత్వం ప్రదర్శిస్తుంది అనే విషయం అర్ధమవుతుంది. అన్యాయం చేస్తుందనే విషయం అన్ని విధాలుగా కూడా అర్ధమవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా సున్నితంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. కాని కేంద్రం గాని వైసీపీ గాని ఈ విషయంలో తప్పులు చేస్తున్నాయి.

దక్షినాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే మినహా కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. కర్ణాటకలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ నిధులు ఇస్తుంది. తమిళనాడులో, కేరళలో ఎన్నికలు ఉన్నాయి కాబ్బట్టి ఇటీవల బడ్జెట్ లో నిధులు ఇచ్చింది అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు బీజేపి వైఖరి మారలేదు అంటే మాత్రం అది దక్షినాది సమస్యగా మారే అవకాశం ఉండవచ్చు. ప్రైవేట్ వ్యక్తులను ఆలోచించుకుని ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోలెకుండా రాజకీయం చేసినా విశాఖ ఉక్కు అమ్మేసినా సరే అది తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

విశాఖ ఉక్కు విషయంలో తెలంగాణా కూడా ఏపీతో కలిస్తే... సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక కలిసి వచ్చినా సరే కేంద్రం ఇబ్బంది పడవచ్చు. దీనిపై కేంద్రం ఆలోచన చేయకుండా ముందుకు వెళ్తుంది. ప్రత్యేక దేశం కావాలని, మాకు అన్యాయం జరుగుతుందని ఉత్తరాది మీద తిరుగుబాటు మొదలైతే... ఆర్ధికంగా బలంగా ఉన్న దక్షినాది తిరుగుబాటు చేయడం మొదలుపెడితే... దక్షినాది మీద బ్రతికే ఉత్తరాది ఇబ్బంది పడటం ఖాయం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని... ప్రత్యేక దేశ ఉద్యమం మొదలైతే జరిగే నష్టాలను అంచనా వేసుకుంటే మంచిది అంటున్నారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కేంద్రానికి సహకరిస్తే పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. టీడీపీ అనుకూల పత్రికలు రాసే కథనాలు కొన్ని ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రాధాన్ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా పదే పదే ప్రస్తావిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వైసీపీ కూడా. మాకు ఏపీలో బలం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే పార్టీ, ప్రభుత్వం కంటే కూడా ప్రాంతీయ సమస్యలను కేంద్రం ఎదుర్కోవాలి. విశాఖ ఉక్కుని దక్షినాది రాష్ట్రాలు తమకు గర్వకారణంగా భావిస్తున్నాయనే విషయాన్ని కేంద్రం గ్రహించాలని కోరుతున్నారు. 

 


                    Advertise with us !!!