అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్...

Minister Perni Nani Speech On AP Cabinet Meeting

అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకాన్ని కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతున్నారు. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా షెడ్యూల్‌ ప్రకటించారు. 5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్‌ ప్రకారం పథకాలు అమలు చేయనున్నట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయన్నారు.

 


                    Advertise with us !!!