యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గమంటున్న సీనియర్ స్టార్లు

Star Heroes Giving Tough Competition For Young Heroes

తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కళకళలాడిపోతుంది. ఏ హీరో చూసినా పెద్ద పెద్ద సినిమాలతో తమ తర్వాతి సినిమాలను సెట్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఇక సీనియర్ హీరోలైన చిరు, నాగ్, వెంకీ, బాలయ్యలు కూడా యంగ్ హీరోలకు పోటీగా తమ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. రికార్డుల బాటలో ఈ యేడాది సీనియర్ స్టార్ హీరోలు కూడా బరిలోకి దిగనున్నారు.
 
చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే దాని క్రేజ్ వేరేలా ఉంటుంది. అపజయమెరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య మే13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య106వ చిత్రాన్ని బోయపాటితో చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య.. క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేయనున్నాడు.  

పోతే ఇప్పటికే వైల్డ్ డాగ్ సినిమాను కంప్లీట్ చేసుకుని ప్రవీణ్ సత్తారుతో మరో యాక్షన్ ఎంటర్టైనర్ ను పట్టాలెక్కించాడు నాగ్. వెంకీ నారప్ప సినిమాను పూర్తి చేసి, మే 14న సినిమాను థియేటర్లలోకి దింపేందుకు ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడితో ఎఫ్3 చేస్తున్నాడు. దాని తర్వాత దృశ్యం2 రీమేక్ చేయనున్నాడు. మొత్తానికి యంగ్ హీరోల మాదిరిగానే స్పీడ్ విషయంలో మేం కూడా ఏ మాత్రం తగ్గమని నిరూపించుకుంటున్నారు మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు.

 


                    Advertise with us !!!