ఉప్పెనలో మొదట హీరోయిన్ ఎవరంటే..!

Uppena Director Buchi Babu Reason Behind Rejecting First Uppena Heroine Manisha

ఉప్పెన మూవీ క్రేజ్ ఇంతలా ఉండటానికి రీజన్ హీరోయిన్ కృతిశెట్టి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కృతి హావ భావాలు, అభినయం ఉప్పెనకు ఎంతో ప్లస్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా మెగాస్టార్ కృతి డేట్స్ ను త్వరగా బుక్ చేసుకోమని చెప్పడం, లేట్ అయితే తర్వాత దొరకడం కూడా కష్టమేనని అన్నాడు. ఆ తర్వాత సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ కృతి స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పాడంటే ఇక అంతకంటే కృతి కి కావాల్సిసిన కాంప్లిమెంట్ ఏముంటుంది?

అయితే అసలు విషయానికొస్తే ఉప్పెన లో మొదటగా అనుకున్న హీరోయిన్ కృతి కాదట. 2 కంట్రీస్ సినిమాలో నటించిన మనీషా రాజ్ అనే తెలుగమ్మాయిని ఉప్పెన కోసం బేబమ్మగా అనుకున్నాడట బుచ్చిబాబు. వాస్తవానికి ఉప్పెన ముహుర్తం లో కూడా మనీషానే ఉంది. ఒక రోజు అనుకోకుండా ఫేస్ బుక్ కృతి ఫోటోలు చూసి ఫిదా అయిపోయిన బుచ్చిబాబు తన కథలో బేబమ్మ క్యారెక్టర్ కు కృతినే కరెక్ట్ అనుకుని.. వెంటనే ఈ విషయం సుకుమార్ కు చెప్పి సలహా అడిగాడట బుచ్చి. కథ విషయంలో కాంప్రమైజ్ కావద్దని, నీకు నచ్చింది చేయమని సుకుమార్ చెప్పడంతో మనీషాను తప్పించి కృతి ని తీసుకున్నారట. అయితే బుచ్చిబాబు డెసిషన్ కు 100 శాతం న్యాయం చేసి బేబమ్మ పాత్రకు కృతి ప్రాణం పోసి.. ఇప్పుడు సినిమా విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది.