పుదుచ్చేరిపై.. తమిళిసై నిర్ణయమే కీలకం

Puducherry CM Narayanaswamy submits resignation after losing majority in Assembly

కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో శాసనసభలో బలపరీక్ష నిరూపించుకోవడంలోనూ విఫలమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తన రాజీనామా లేఖను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకు అందించారు. దీంతో తరువాత పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎల్‌జీ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. ఆమె తీసుకునే నిర్ణయంపైనే పుదుచ్చేరి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

 


                    Advertise with us !!!