అంతరిక్షంలోకి క్యాన్సర్ విజేత!

Hayley Arceneaux set to become youngest American in space

క్యాన్సర్‌ను జయించిన 29 ఏండ్ల ఫిజిషియన్‌ అసిస్టెంట్‌ హేలే ఆర్సినాక్స్‌.. ఈ ఏడాది చివరిలో స్పేస్‌ఎక్స్‌ చేపట్టే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర ద్వారా రోదసిలోకి వెళ్లనున్నారు. బిలియనీర్‌ బేర్‌డ్‌ ఇసాక్‌మ్యాన్‌, మరో ఇద్దరితో కలిసి ఆమె అంతరిక్ష యాత్ర చేయనున్నారు. సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌లో గతంలో పేషెంట్‌గా చేరిన హేలే.. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. పదేండ్ల వయసున్నప్పుడు ఆమెకు ఇదే దవాఖానలో మోకాలి శస్త్రచికిత్స చేసి టైటానియం రాడ్‌ను అమర్చారు. ఈ స్పేస్‌ మిషన్‌ ద్వారా ఇసాక్‌మ్యాన్‌.. సెయింట్‌ జ్యూడ్‌ దవాఖానకు విరాళాలు సేకరిస్తున్నారు. నాలుగు సీట్లలో ఒక సీటును హాస్పిటల్‌కు కేటాయించారు.