భారీ రేటు పలికిన బాలయ్య సినిమా థియేట్రికల్ రైట్స్

Excellent Pre Release Business for Balakrishna Boyapati BB3 Film

సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాల తర్వాత మాస్ డైరక్టర్ బోయపాటి, నటసింహం బాలయ్య కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి మొన్న టీజర్ వరకు ప్రతీదీ సెన్సేషన్ గానే నిలుస్తున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు థమన్ రెండోసారి బాలయ్య మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఎప్పటిలానే బోయపాటి కాంబోలో ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. బాలయ్య 106వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రైట్స్ ఇప్పటికే 35 కోట్లు పలకగా.. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను 16 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నాడని చెప్తున్నారు. మే 28న వేసవి కానుకగా  రిలీజ్ కానున్న బీబీ3.. బోయపాటి, బాలయ్య లకు హ్యాట్రిక్ హిట్ అవుతుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా కన్ఫార్మ్ అయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.