వెంకీతో సినిమా చేయాలని ముచ్చట పడుతున్న అల్లరోడు

Allari Naresh Want to Act with Victory Venkatesh

ఏడిపించడం తేలికేమో కానీ నవ్వించడం అంత ఈజీ కాదు. అలాంటి హాస్య రసాన్ని అవలీలగా పోషించే హీరోల్లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగు తెరపై అల్లరి నరేషే కనిపిస్తాడు. తన బాడీ లాంగ్వెజ్ నుంచి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తాయి. దీంతో నరేష్ సినిమాలకు మార్కెట్ పెరగడం, ఆయన మినిమం గ్యారెంటీ హీరో అవడం అన్నీ జరిగాయి. అయితే నరేష్ కామెడీ మాత్రమే చేయగలడు అనే విమర్శలను గమ్యం, శంభో శివ శంభోలతో తిప్పి కొట్టాడు. దీంతో నరేష్ మల్టీ టాలంటెడ్ అనే విషయం తేలిపోయింది. అయితే గత ఎనిమిదేళ్లుగా నరేష్ కు విజయం వరించలేదు. ఇన్నాళ్లకు మళ్లీ నాంది తో ఆ సక్సెస్ ను అందుకున్నాడు. మొదటి సినిమాకు విజయం వస్తే ఎలా ఫీలవుతారో అలా ఉంది ఇప్పుడు నరేష్ పరిస్థితి. దీంతో నరేష్ వరుస ఇంటర్వూలతో బిజీగా మారాడు.

రీసెంట్ గా ఒక ఇంటర్వూలో నరేష్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. నాంది నాకు సక్సెస్ తో పాటు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. నేను కామెడీ సినిమాలతోనే పాపులర్ అయ్యాను నాంది సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని టెన్షన్ పడ్డాను కానీ కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా హిట్ చేస్తారని అర్థమైంది. ఇక నుంచి కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలని డిసైడ్ అయ్యాను. మల్టీ స్టారర్ మూవీస్ కూడా చేయాలనుంది. వెంకటేష్ గారితో కలిసి నటించాలనుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఫ్యూచర్ లో డైరక్షన్ చేయాలనే ఆలోచన కూడా ఉందని నరేష్ తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. 

 


                    Advertise with us !!!