మోడీ ఈ నిబంధనతో పెద్ద తప్పు చేస్తున్నారా...?

PM Awas Yojana suffering hiccups due to fund crunch

దేశవ్యాప్తంగా కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సరే... ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనిచేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో జరుగుతున్న లోపాలు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్టించుకోవడం లేదు అనే ఆవేదన బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు కూడా నిబంధనలు అనేవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి.

ఈ నిబంధనల విషయంలో ప్రభుత్వాలు అతి జోక్యం ప్రదర్శిస్తే మాత్రం కాస్త ఇబ్బందులు ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎంత బలంగా ఉన్న పార్టీ అయినా సరే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా అమలు చేసుకోవాలి. అలాగే ప్రతి లబ్ధిదారునికి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని అందే విధంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో జరగడం లేదు అని ఆరోపణలు వినబడుతున్నాయి.

ప్రధానంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి. అందుకే చాలా రాష్ట్రాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన విషయంలో ఆసక్తి చూపించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా ఇళ్లు కట్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి 2 లక్షల 50 వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అయితే దీనికి పెట్టిన కొన్ని షరతులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి అని అంటున్నారు.

వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రిటర్న్స్ అవసరం అనేది ఎంతమాత్రం కూడా ఉండదు. కానీ ఐటీ రిటర్న్స్ ఉంటేనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అవుతున్నారు. సొంత ఇల్లు కట్టుకునే వాళ్లకు గృహరుణం పెట్టుకోవాలి అంటే కచ్చితంగా ఐటి రిటర్న్స్ ఉండాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గృహ ఋణం ద్వారానే వస్తుంది. దానికి ఐటి రిటర్న్స్ కావాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది పేదలు ఈ కార్యక్రమానికి దూరమవుతున్నారు అనే ఆవేదన ఉంది కేంద్ర మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానమంత్రికి చెప్పే ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదని కొంతమంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే పక్కా ఇళ్లు కట్టిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం వలన పేదలకు ఫలాలు అందడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నా సరే... ఆ నిధులు మావే అని రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలతో వారిని దూరం చేస్తోంది. ఈ ఐటీ రిటర్న్స్ అనే విధానాన్ని మార్చకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఇబ్బంది పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 


                    Advertise with us !!!