ఈ విషయంలో చంద్రబాబు, జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలా...?

YS Jagan Vs Chandrababu

తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని విషయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు అనే భావన రాజకీయవర్గాలు పదేపదే వ్యక్తం చేస్తూ ఉంటాయి. ప్రధానంగా కొంతమంది యువ నేతలకు పదవులను ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ప్రోత్సహించే ధోరణితో వెళ్లకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా యువ నేతలకు ప్రోత్సాహం అందించే విషయంలో చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా విఫలం అవుతూనే ఉన్నారు.

వారికి ప్రోత్సాహం అందించే విషయంలో ఇతర పార్టీలు ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ప్రయత్నం చేయడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో ఉన్న యువ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై నమ్మకం కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణం అని అంటున్నారు. దాదాపుగా పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న చాలా మంది యువకులకు ఇప్పుడు ప్రోత్సాహం లభించడం లేదు అనే భావన ఉంది. నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా తమ అవసరం ఉంటే మాత్రమే యువ నేతల వైపు దృష్టి సారిస్తున్నారు.

దీంతో పార్టీ అంతిమంగా నష్టపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దీని మీద దృష్టి సారించడం లేదు. వాస్తవానికి అధికార వైసీపీలో యువ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు నుంచి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. దీని కారణంగా ఆయన కోసం ముందుకు వస్తూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీలో అలాంటి ప్రయత్నాలు ఏవీ కూడా జరగడం లేదు. దీని కారణంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న యువ నాయకత్వం ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారు.

కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టే నేతలు చాలా మంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు నుంచి వారికి ప్రోత్సాహం లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. అధికార వైసీపీలో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లి పోయే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే రాజకీయం నడుస్తుంది. చంద్రబాబునాయుడు ముందు నుంచి సీనియర్ నేతల మీద ఆధారపడుతుంటారు. 2014 ఎన్నికల విజయం తర్వాత సీనియర్ నేతల మీద ఆయన మరింత ఆధారపడ్డారు. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

4, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకు మళ్లీ సీట్లు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబునాయుడు ఇదే పని ఎక్కువగా చేస్తున్నారు. నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే విషయంలో ఆయన చేస్తున్న తప్పుల కారణంగా అంతిమంగా పార్టీ కార్యకర్తలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధానాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు మారుస్తారో చూడాలి.