బాహుబలి రేంజ్ లో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' మన గోదావరి తీరాన షూటింగ్

ponniyin selvan shooting in Rajahmundry

ఒకప్పుడు మన తెలుగు సినిమాలన్నీ మద్రాస్ (చెన్నై) లోనే జరిగేయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది తమిళ్ సినిమాలు చాలా వరకు రామోజీ ఫిలిం సిటీ లో, విశాఖపట్నం లో జరుగుతున్నాయి. తాజాగా   లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఆలోచనల నుంచి పాన్ ఇండియా రేంజ్ రేంజ్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్ రాజమండ్రి వద్ద సింగంపల్లి లో భారీ నావ  సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు.    చియాన్ విక్రం, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య రాజేష్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చోళుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇన్ని రోజులు చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన కోట సెట్ లో షూటింగ్ జరిగింది. పోలవరం మండలంలో సింగన్నపల్లి వద్ద ఓ సినిమాకు సంబంధించి షూటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో టూరిజం బోట్లు, పడవలు ఏర్పాటు చేసి డెకరేషన్‌ చేపట్టారు.

సింగంపల్లి నుంచి గోదావరి నదిలో పాపికొండలు వెళ్లే మార్గంలో షూటింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగులతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ సిబ్బంది ఆదివారం నదిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా గోదావరి తీరంలో పోలవరం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ ని దర్శకుడు మణిరత్నం స్టార్ట్ చేశారు.ఈ షూటింగ్ లో త్రిష కూడా పాల్గొంది.గోదావరిలో హంస తరహాలో ఉన్న పడవపై రొమాంటిక్ సన్నివేశాలు, పాటని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

తమిళ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ పోలవరంలో జరుగుతుందనే టాక్ బయటకి రావడంతో ఆ ప్రాంతం చుట్టుపక్కల జనం విపరీతంగా షూటింగ్ లొకేషన్ వద్దకి స్టార్ నటులని చూడటానికి తరలి వెళ్ళారు.త్వరలోనే విక్రమ్, ఐశ్వర్యారాయ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలోని మారేడుమల్లి ఫారెస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో ఆచార్య సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఇక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

 


                    Advertise with us !!!